Logo
Date of Publish : 19 March 2026, 8:11 pm
Editor : Sake Naresh

ఉగాది అవార్డులందుకున్న ‘అనంత’ వాసులు 

అనంతపురము, మార్చి 19, జనస్వరం : శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా నలుగురు అనంతవాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి శాలువా, తెలుగుతల్లి జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు పదివేల రూపాయల నగదు కూడా అందజేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది అవార్డు అందుకున్న వారిలో వసంత కిరణ్ రాయసం, (కూచిపూడి, భరతనాట్యం), తిరుపాల్ నాయక్, (నాటకరంగం), ఉరుముల సోమశేఖర్, (జానపదం - ఉరుములు), ఏమినేని రవిచంద్ర, (జర్నలిజం) తదితరులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది వేడుకల్లో జిల్లాకు చెందిన ప్రముఖ సహస్రావధాని, అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. నలుగురు అనంతవాసులు ఉగాది అవార్డు అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అవార్డు గ్రహీతలను కలిసి విజయవాడలో ప్రత్యేకంగా అభినందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com