జనసేన నాయకుడు ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్యర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసేన నాయకుడు ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్యర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

              చెన్నేకొత్తపల్లి మండలం లోని బసంపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మరియు పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. అలాగే బసంపల్లి పంచాయతీలోని కొన్ని ప్రజా సమస్యల మీద చర్చించడం జరిగింది.  ఇటికోటి క్రాంతి కుమార్ మాట్లాడుతూ మండలం లో గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రభుత్వంకు చిత్తశుద్ది లేదు : చిత్తూరు జనసేన సంయుక్త కార్యదర్శి కీర్తి