
పుష్కరాలపేట అంగన్ వాడి సెంటర్ నందు జ్యోతి ప్రజ్వలన
రాజమండ్రి పుష్కరాల సెక్టర్ నందు గల అంగన్ వాడి కేంద్రంలో సూపర్ వైజర్ కె. లీలా కుమారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన జరిగినది. అలాగే బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ, విలువలు గురించి తెలియజేశారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని సంబోంధిస్తూ విద్యా వ్యవస్థ నందు అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల గురించి, అత్యవసర సేవలు, చట్టబద్దమైన పిల్లలను పెంచుకొను మొదలగు విషయాల గురించి తల్లిదండ్రులకు లీలాకుమారి గారు వివరించారు. ఈ కార్యక్రమానికి సామాజికవేత్త సిద్దు సూర్యవంశ్ గారు స్వీట్స్ మరియు బిస్కెట్స్ ఇతర పదార్థాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.









