
నిరాశ్రయులైన వృద్ధులను ఆదుకోవాలి : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య
ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య మాట్లాడుతూ ఆళ్ళగడ్డ పట్టణంలో సద్దాం కాలనిలో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో సత్య రూరల్ డెవలప్మెంట్ సోసైటీ పేరుతో ప్రదీప్ అనే వ్యక్తి నడుపుతూ మెప్మా సంస్థ నుండి వచ్చే నిధులను మరియు ఆశ్రమంలో 35 మంది వృద్ధులను కొందరు పట్టణంలో బిక్షాటన చేపిస్తూ వారు తెచ్చిన డబ్బులను మరియు డోనార్స్ ఇస్తున్నటువంటి నిత్యావసర సరుకులను అంగళ్ళకు అమ్ముకుంటూ నిధులను పక్కదారి పట్టిస్తూ వృద్దులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా కనీస అవసరాలైన టాయిలెట్లు కూడా లేకుండా నిర్వహిస్తున్నారు. వృద్దులు వీటి మీద ప్రదీప్ ను ప్రశ్నిస్తే వారిమీద దాడి చేసి ఆశ్రమం నుండి గెంటి వేస్తున్నాడు. సంబంధిత అధికారి మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ మీద విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారికి సిటీ మేనేజర్ శోభా రాణి గారికి ఆళ్లగడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయటం జరిగింది. వెంటనే ప్రదీప్ మీద విచారణ చేపట్టి చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరపున మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య రాజారామ్ అక్బర్ మోహన్ దస్తగిరి బాష మహాబూబ్ బాష పాల్గొన్నారు.








