ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు, రక్తదానం చేసిన జనసైనికులు

రక్తదానం

        తూర్పు గోదావరి ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం పొదలడ గ్రామ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పంచదార చినబాబు, మెడిచర్ల సతీష్, రావూరి సాయి, గెల్లీ స్వామి, ఇంటి తులసి, గెల్లీ రాము, సాధనల చిన్నారామ్, సాయి, దొండ సత్య ప్రసాద్, సీరిజినీదీ నాగ భాస్కర్ రక్తదానం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ గ్రామంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇతరులకు ప్రాణాదానం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఎటువంటి స్వచ్ఛంధ కార్యక్రమాలు చేసినా జనసేన పార్టీ తరుపున జనసైనికులు అండగా ఉంటామని అన్నారు. 

See also  జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శ్రీ తాటంశెట్టి నాగేంద్రగారికి శుభాకాంక్షలు : మాదాసు నరసింహులు