
అత్యాచారం చేసిన 6 సంవత్సరాల పాపను పరామర్శించిన జనసేన వీర మహిళలు
రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు గ్రామం నందు జరిగిన మరో అతి దారుణమైన సంఘటన 6 సంవత్సరాల పసికందును 24 సంవత్సరాల వయస్కుడు (వ్యక్తి) కులూరు వరహాలు అనే అప్పన్న అత్యాచారం చేసి పారిపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, విషయం తెలుసుకున్న వీరమహిళలు వెంటనే 2టౌన్ నుంచి స్థానిక GGH యందు కాకినాడ మాజీ మేయర్ మరియు రాష్ట్ర లోకల్ ఎలక్షన్ కమిటీ మెంబెర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారు మరియు వీరమహిళలు జయ ముత్యాల, రమ్యజ్యోతి పిల్లా, కృష్ణవేణి సుంకర, జ్యోతి దాలే అలాగే అమలాపురం వైపుగా వెళ్లే వైజాగ్ వీరమహిళ శ్రీమతి కిరణ్ గార్లు అక్కడికి వెళ్లి పసిపాపను మరియు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి, అక్కడ దిశా సెంటర్ నందు సంరక్షకులతో వివరాలను అడిగి ఆ బాధిత కుటుంబం తరుపున వారికి సత్వర న్యాయం జరగాలని మరియు ఫోక్సో చట్టాన్ని బలంగా అమలపరుస్తూ ఆ వ్యక్తికి సరైన శిక్ష పడే విధంగా సహకారం అందించవలసిందిగా కోరుతూ అలాగే ఆ తల్లికి ధైర్యాన్ని చెబుతూ మేమున్నాం అనే భరోసాను అందించి వచ్చారు.









