అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

     ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం, సింగన్నపాలెం గ్రామంలో సురాపు అప్పమ్మ పూరిళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయి వస్తువులు, సొంతగా అంత వయసులో పండించుకున్న పంట మరియు కూలిపని చేసి సంపాదించిన నగదు దగ్దమైంది. ఈ విషయం తెల్సుకున్న జనసేన నాయకులు ఎంపీటీసీ సిక్కోలు. విక్రమ్, దూబ.సంగం నాయుడు, రుద్ర,  కార్యకర్తలు కాలిపోయిన పూరిల్లూ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం తెలుసుకొని అప్పమ్మా కి ఆర్ధిక సాయం చేయడం జరిగింది. అలాగే కొల్ల.జయరామ్, కొత్తగా ఇల్లు నిర్మించడానికి జనసేన నాయకులు అండగా ఉంటారని అప్పమ్మ అవ్వకి మాట ఇచ్చి కొండంత బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఇప్పటం గ్రామ ప్రజలు