– వారాహి ఎన్నికల ప్రచార యాత్రతో వైసిపి పతనాన్ని శాసిస్తుంది
– విజయవాడ నడిబొడ్డున పశ్చిమ నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభమైంది
– పవన్ కళ్యాణ్ యాత్రతో వైసిపి నేతల్లో వణకు పుడతుంది
విజయవాడ, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ వారాహితో రాష్ట్రం నడిబొడ్డున కదం తొక్కారని, దీంతో వైసీపీ పతనం ఆరంభమైయిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. బుధవారం తన కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ మా అధ్యక్షులు వారాహి ఎన్నికల ప్రచార యాత్రతో వైసిపి పతనాన్ని శాసిస్తుందనీ, వారాహి ఏవిధంగా రోడ్ల మీద తిరుగుతుందని వైసిపి నాయకులు బింకాలు పోయారనీ, ఇప్పటికైనా మీ కారుకూతలు మానుకోవాలని తెలిపారు. మీలాంటి కుక్కలు, నక్కలు, అడ్డ గాడిదలను ప్రజలు తరమి కొడతారని, విజయవాడ నడిబొడ్డున పశ్చిమ నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర ప్రారంభమైందని, సమాచారం తెలిసిన కొద్ది సమయంలోనే వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారని, అడుగడుగునా అధినేతకు పుష్పాభిషేకాలతో ఘన స్వాగతం పలికారని, పవన్ కళ్యాణ్ యాత్రతో వైసిపి నేతల్లో వణకు పుడతుందనీ, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలని మహేష్ అన్నారు.