జనసైనికుడి మరణం తీరని లోటు : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

వాసగిరి మణికంఠ

       గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు G.L మోహన్ రంగా గారి భౌతిక గాయాన్ని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ సందర్శించి ఘననివాళులు అర్పించారు. అనంతరం ఆయన అకాల కాలమరణాన్ని జనసేన పార్టీ నాయకులు చింతిస్తూ ఆయన పార్థివ మృతదేహం దగ్గర జనసేన పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ మోహన రంగా గారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు నాగయ్య రాయల్, గాజుల రఘు, కోటేశ్వరరావు, హేమంత్ కుమార్ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు…

See also  రోడ్లను మరమ్మత్తులు చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు