పిఠాపురం జనసేన వైపు చూస్తుంది : ఇంటింటికి జనసేన కార్యక్రమం

పిఠాపురం

        పిఠాపురం జనసేన: పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి 24వ వార్డు కత్తులగూడెంలో ఆమె పర్యటించి, స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేనకు పిఠాపురంలోనే గాక రాష్ట్ర మొత్తం విశేష స్పందన లభిస్తుందని ఆన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మూడున్నర సంవత్సరాలు పైగా ఈ ఇబ్బందులు అనుభవించిన ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన చూస్తున్నారని ఇది జనసేన గెలుపుకు శుభ సూచకమని ఆమె అన్నారు. ప్రతి ఇంటికి సొంత అడపడుచుగా కష్ట సుఖలలో తోడు ఉంట అని స్థానిక ప్రజలకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, పుణ్యమంతుల మూర్తి, బుర్రా సూర్య ప్రకాష్, కాళ్ల రాజు, దేశి రెడ్డి సతీష్, సుబ్రమణ్యం, వినయ్, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకుల అందించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి