నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన బనగానపల్లె జనసేన నాయకులు మరియు ప్రజా సంఘాలు

బనగానపల్లె

     బనగానపల్లె, (జనస్వరం) : బనగానపల్లె పట్టణం నందు గురువారం జనసేన పార్టీ నూతన సంవత్సర క్యాలెండర్ లు జనసేన పార్టీ నాయకులు భాస్కర్ యాగంటి, బసవేశ్వర రైతు సంఘం అధ్యక్షులు మూలా రెడ్డి, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో క్యాలెండర్ లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని కొత్త సంవత్సరం నుండి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. రైతు సంఘం నాయకులు మూలారెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరం నుండి రైతులకు అంతా మంచే జరగాలని అన్నారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడుతున్నారు అని రాష్ట్రంలో సమస్యలు ఎక్కడున్నా ముందుకు వచ్చి నిలబడుతున్నారు అని వారికి మా లాంటి ప్రజాసంఘాల నాయకులు మద్దతు ఉంటుందని ప్రజా సమస్యలను తీర్చడంలో ముందు ఉన్న వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పృథ్వి, మహబూబ్, కాసిం, అజిత్ రెడ్డి, కులాయి, రామ్మోహన్ జనసైనికులు విక్రమ్, జనార్ధన్, లోకేష్, ప్రశాంత్, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

See also  విజయవాడ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు