విద్యుత్ ఘాతంతో భార్య భర్తలు మృతి చెందిన కుటుంబానికి జనసేన నాయకులు పరామర్శ

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గ కేంద్రంలో గల విద్యుత్ శాఖ కాలనీలో భార్య భర్తలు విద్యుత్ ఘాతాంతో గురై మృతి చెందిన గొల్లోరి దొంబు, భార్య గొల్లోరి పార్వతి కుటుంబాన్ని బుధవారము జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో గల కంఠ బౌన్స్లో గూడాలో వారి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబానికి పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, మాదల శ్రీ రాములు, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం వీధిలో ఉన్న డ్రైనేజ్ ని పరిశీలించారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా వీధిలో ఉన్న ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జనసైనికులు సంతోషి, గతుం.లక్ష్మణరావు, కిల్లో రాజా భరత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

See also  పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు