ఏ ఆధారం లేని మహిళకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

         అనపర్తి ( జనస్వరం ) : అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఏ ఆధారం లేని మహిళకు ఇంటి నిర్మాణం నిమిత్తం రామేశ్వరం జనసైనికుల సహకారంతో సహాయం అందించారు. అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారి చేతులు మీదుగా 10000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. అలాగే రామేశ్వరం జనసేన ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు గారు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరస్వామి, జడ్పిటిసి అభ్యర్థి కాశి రాణి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఏసు, తోటకూర వెంకట రమణ, నాగిరెడ్డి శ్రీనివాస్, కోలా శ్రీను, గణపతి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు

See also  వరద బాధితులని ఆదుకున్న కువైట్ ఎన్నారై జనసేన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి