డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి జనసైనికులు

    కదిరి, (జనస్వరం) : అనంతపురం జిల్లా కదిరి మండలం కొండమనాయుడు పాలెంలో నివశిస్తున్నటువంటి కూలిపని చేసుకుంటూ జీవనం గడిపే ముడే సుధాకర్ నాయక్ అనే వ్యక్తికి రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారింది. ఇతను వైద్యం నిమిత్తం కదిరి నుంచి తిరుపతికి నెలకు రెండు లేదా మూడు సార్లు డయాలసిస్ చేపించుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ డయాలసిస్ కు వెళ్ళే ప్రతి సారీ 20,000 వేలు నుంచి 30,000 వేల రూపాయల దాకా ఖర్చు రావడంతో మన జనసేన పార్టీ కార్యకర్తలకు కొండమ నాయుని పాల్యంలో ఉన్న తన స్నేహితులు సమాచారం అందించడం జరిగింది. వీరి ఆర్థిక పరిస్థితిని గమనించి వారికి కదిరి జనసైనికులు సహకారంతో నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆపరేషన్ కోసం రెండు కిడ్నీలు మార్చాలని వైద్యులు సూచించారు. ఇది అత్యధిక ఖర్చుతో కూడుకున్న కారణంగా వారి కుటుంబ సభ్యులు దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ కుటాల, అనిల్, శ్రీధర్, రాజేంద్ర, మున్న, సోము శేఖర్, గణేష్ రాజ్, గౌతమ్, జనసైనికులు, కొండమనాయుని పాల్యం గ్రామస్థులు పాల్గొన్నారు.

See also  చీపురుపల్లి జనసైనికులకు అండగా జనసేన నాయకులు