
సేవా సన్మాన కార్యక్రమలతో జనసేనాని జన్మదిన వేడుకలు : ఎమ్మిగనూరు జనసైనికులు
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను 5 రోజులపాటు పలు సేవా సన్మాన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో సోమవారం రోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 29 వ తేదీ నుంచి అనాధ ఆశ్రమంలో అన్నదానం, నిరుపేద అభిమానులకు కరోనా కిట్స్ అందించి లాక్ డౌన్ సమయంలో కరోనా విపత్కర సమయాల్లో పలు సేవారంగాలకు చెందిన వారు నిరుపేదలను గుర్తించి స్వచ్చందంగా పలు రకాలుగా చేయూత అందించారని, సహాయం అందించిన కరోనా వారియర్స్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా పలు దేవాలయాల్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం సెప్టెంబర్ 2 న జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి బాషా, గాజులవెంకటేష్, మల్లికార్జున, ఉపేంద్ర యాదవ్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.









