మడకశిర నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి యువకులు చేరిక

    మడకశిర, (జనస్వరం) : అనంతపురం జిల్లా మడకశిర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శివాజీ ఆధ్వర్యంలో మెల్లవాయి పంచాయతీ నుండి పలు గ్రామాల 50 మంది యువకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం రేపటి భావితరాల భవిష్యత్ కోసం యువకులే నాంది పలకాలని, పల్లె గ్రామాలే ఈ రాష్ట్రానికి పచ్చ తోరణం అని పార్టీ విధివిధానాల గురించి  వివరించడం జరిగింది. వాళ్ల మాటలకు ప్రభావితమై జనసేన పార్టీలోకి చేరుతున్నామని యువకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, మండల కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

See also  నరవ గ్రామంలో గల కళ్యాణ మండపాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :