జనసేన కార్యకర్తల మీద వైసీపీ పార్టీ వాళ్ళు దాడి చేస్తే సహించేది లేదు : మాకినీడీ శేషుకుమారి

జనసేన కార్యకర్తల మీద వైసీపీ పార్టీ వాళ్ళు దాడి చేస్తే సహించేది లేదు : మాకినీడీ శేషుకుమారి

               పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ మాకినీడీ శేషుకుమారి మాట్లాడుతూ గోకివాడ గ్రామంలో జనసేన కార్యకర్త పవన్ ను వైస్సార్సీపీ పార్టీకి చెందిన అదే గ్రామ నాయకులు కొందరు బెదిరించడం నా దృష్టికి వచ్చింది. మన జనసేన కార్యకర్తల జోలికి వస్తే ఏ పార్టీ నాయకుడి నైనా చొక్కా పట్టుకుని నిలదీసే ధైర్యం నాకుంది. వారిలో కొంత మంది డాక్టర్ గారు కూడా మాకు తెలుసు అంటున్నారట. డాక్టర్ గా మన డా. మాకినీడి వీర ప్రసాద్ గారు మల్లాం లో వైద్య వృత్తి ప్రారంభించి నప్పటినుండీ ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా పార్టీలకతీతంగా ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైనా వైద్యసలహ సహాయములు చేస్తూనే వున్నారు. అది ఆయన ప్రవృత్తి. నా పార్టీ కార్యకర్తలను సంరక్షించుకోవడానికి ఎటువంటి చర్యలకైనా నేనుంటాను అని భరోసా కల్పిస్తూ, అటువంటిది ఏమైనా ఎప్పుడైన జరిగితే నేను ముందుంటానని అని మీకు మరొక్కసారి తెలియ చేస్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్త లంటే ఎంత అభిమానమో, జనసైనుకులంటే ఎంత ప్రాణమో ఆయన ప్రతినిధిలుగా నాకు తెలుసు. నా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కష్ట పడిన ప్రతీ కార్యకర్త ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. వారికి ఎటువంటి ఆపద వచ్చిన ముందు ఉంటానని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను అని అన్నారు. 

See also  జనసేన పార్టీ నిరసనకు సమస్య పరిష్కారం చూపిన అధికారులు