వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్ జనసేన లక్ష్యం : డా.రవికుమార్ మిడతాన

రవికుమార్ మిడతాన

          విజయనగరం ( జనస్వరం ) : జగన్ రెడ్డి  ఇలాంటి టోల్ ఫ్రీ నంబర్లు వందల కొద్ది పెట్టినా… ప్రజా సమస్యల ఫోన్ కాల్స్ తో మీ టెలిఫోన్ జంక్షన్ బాక్స్ లు  జామ్ కావాల్సిందే కానీ ప్రజా సమస్యల పరిష్కారం కావని  జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు  డా.రవికుమార్ మిడతాన ధ్వజమెత్తారు. ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి  ప్రారంభిస్తున్న “జగనన్నకు చెబుదాం” కార్యక్రమంకు ఇప్పటికే జిల్లాల్లో జరుగుతున్న స్పందన కార్యక్రమం కు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా..? గడిచిన నాలుగు సంవత్సరాలుగా స్పంద‌న‌కు కాళ్లు అరిగేలా తిరిగినా ప్ర‌యోజ‌నం ఏమైనా వుందా? రాష్ట్రంలో గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలు చిన్నాభిన్నమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఇప్పుడు సమస్యలు లేనివారు ఎవరని అన్నారు. మీ ప్రభుత్వ పాలనపై వేలెత్తి చూపిన వారిపై దాడులు, అక్రమ అరెస్టులు, ఆస్తులు ధ్వంసం ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరిస్తారా..? రాష్ట్రంలో గడిచిన నాలుగు సంవత్సారాలలో ప్రతి ఒక్కరి జీవితం సమస్యల వలయం గానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

See also  దేవాలయాల మధ్య ఉన్న మద్యం దుకాణమును తొలగించాలని MRO గారికి వినతిపత్రం ఇచ్చిన కోవూరు నియోజకవర్గ జనసేన నాయకులు