అడబిడ్డలకు రక్షణ ఇవ్వలేని అసమర్థత వైసీపీ ప్రభుత్వం : మంగళగిరి జనసేన నాయకులు

     మంగళగిరి, (జనస్వరం) :  ఈరోజు మంగళగిరి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆడ బిడ్డలపై వరుసగా జరుగుతున్న అత్యాచార, హత్యలను అదుపు చేయలేని అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో జనసేన పార్టీ నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది. చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపైన గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా అత్యాచారాలు, హత్యలు జరగడం ప్రభుత్వ వైఫల్యమే అని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆడబిడ్డల మానప్రాణాలకు ఇవ్వడం లేదని ఇకనైనా పటిష్టమైన చర్యలు చేపట్టి మహిళలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా పార్టీ వీర మహిళలు మాట్లాడుతూ మహిళల మాన ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగిపోవాలని, ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని పరిపాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత విభాగం చైర్మన్ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్  చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్, MTMC కోఆర్డినేటర్ మునగపాటి వెంకట మారుతీరావు, రాష్ట్ర చేనేత కమిటీ ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు షేక్ కైరల్లా, ఈమని ఎంపిటిసి పసుపులేటి సాయి చైతన్య, పార్టీ సీనియర్ నాయకులు దాసరి శివ నాగేంద్రం, తుమ్మపూడి నరసింహారావు, శెట్టి రామకృష్ణ, కట్టెపోగు వినోద్ కుమార్, సుందరయ్య, తదితర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  డొక్కా సీతమ్మ గారి పేరు మీద జనసేన నాయకుల చలివేంద్రం ఏర్పాటు