ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును హరిస్తున్న YCP ప్రభుత్వం : దారం అనిత

దారం అనిత

          మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కోసం 5 వేల మంది విద్యార్థులతో తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని బలవంతంగా అధికార దుర్వినియోగంతో అడ్డుకోవడాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. విద్యార్థులకు యాజమాన్యానికి నోటీసులిచ్చి మీరు నిరసన కార్యక్రమాలు పాల్గొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని నోటీసులు పంపించి భయభ్రాంతులకు గురిచేయడం అధికారులకు తగని పని ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే దయచేసి అధికారులు కూడా సహృదయంతో అర్థం చేసుకొని మదనపల్లి ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించాలని లేదంటే చరిత్రహీనులు అవుతారని అన్నారు. 

See also  అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన జనసేన నాయకుడు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి