మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులకు సన్మానం

మహిళా దినోత్సవం సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులకు సన్మాన

– చీరలు పంపిణీ చేసి గౌరవించిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు

శ్రీ సత్యసాయి జిల్లా, మార్చి 10, జనస్వరం : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజానికి సేవలందిస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మార్గదర్శకత్వంలో, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ స్వామి సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పారిశుధ్య కార్మికులను సత్కరించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం పుట్టపర్తి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండేపాగు గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోపీనాథ్ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులను సత్కరించడం ఆనందంగా ఉందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండేపాగు గోపీనాథ్ తెలిపారు. సమాజం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్న ఈ మహిళలు నిజమైన సేవకులని ఆయన పేర్కొన్నారు. మహిళల కష్టాన్ని గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, వారి సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. మహిళలకు సమాజంలో మరింత గౌరవం, గుర్తింపు లభించేలా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ గౌడ్, పట్టణ అధ్యక్షులు కళ్యాణ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బలగంగాధర్, జిల్లా కోశాధికారి సురేంద్రతో పాటు ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తాపురం అనిల్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.

See also  పుస్తక పఠనంతోనే మెరుగైన భవిత : ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు