
రాష్ట్రంలో స్త్రీ కి తగిన రక్షణ లేదు : జనసేన నాయకుడు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్
పెందుర్తి నియోజకవర్గం 4 నెలల క్రితం అపర్ణ ను భర్త వేధింపులకు గురి చేసి యాసిడ్ ద్రావణాన్ని బలవంతంగా త్రాగించి చావు బతుకుల మధ్య ఉన్న అపర్ణ గారు 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని పాపను ఆదుకొని న్యాయం చేయమని మీడియా ద్వారా కోరారు. విశాఖపట్నం జిల్లా, పెందుర్తి, ఎస్ కోట నియోజకవర్గ జనసైనికులు మరియు బిజెపి నాయకులు స్పందించి వెంటనే సందర్శించి 35 వేలు నగదు ఇవ్వడంతోపాటు, NRI హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వెంటనే వైద్యం అందేలాగా చొరవ తీసుకొని మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ 88 వార్డు నాయకులు శ్రీ వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారాయి ముఖ్యమంత్రులు మారారు ఆడపడుచులపై దాడులు మాత్రం తగ్గడం లేదు, దిశ చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఆ చట్టాలుకు భయపడే సమాజాన్ని తయారు చేయలేక పోతున్నారు. ఈ యొక్క పాలక నాయకులు, అపర్ణ పై జరిగిన దాడులు ప్రదేశం పెందుర్తి నియోజకవర్గం లో ఉంది, బాధితురాలు అమ్మ గారి ఇల్లు ఎస్.కోట నియోజకవర్గం లో ఉంది. ఆధార్ కార్డులు భీమిలి నియోజకవర్గంలో ఉంది అని పెందుర్తి నియోజకవర్గ MLA అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు మా ప్రభుత్వం చాలా చేసింది, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తుల తో మాట్లాడి మొరుగైన వైద్యం కోసం ప్రయత్నిస్తాము అని కుంటి సాకులు చెప్పడం మానేసి, చిత్తశుద్ధితో విశాఖపట్నం జిల్లా ఇన్చార్జి మంత్రుల ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, సాయి రెడ్డి గారు దృష్టికి తీసుకుని వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోమని డిమాండ్ చేయడంతో చేశారు. మెరుగైన వైద్యం అందించాల్సిన అపర్ణ చాలా రోజుల నుంచి ఇంటి వద్దే ఉండడంవల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది కావున వెంటనే వైద్యం కోసం మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్లి చికిత్స అందించవలసిందిగా చేతులెత్తి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మోటూరి సన్యాసినాయుడు గారు, శంకర్రావు గారు, మధుగారు, వబ్బిన సత్తిబాబు, శ్రీను, పార్వతి గారు, తనకాల శ్రీనివాస్, కనకరాజు, శివాజీ, బిజెపి నాయకులు గొర్ల రామ్ నాయుడు గారు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.








