
2024 లక్ష్యంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము : తిరువూరు చిరంజీవి యువత
తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత కమీటీ కొత్తగా ఎన్నికయ్యింది. పగడాల లక్ష్మణ రావు గారు
ఉపాధ్యక్షులు క్రిష్ణాజిల్లా (పశ్చిమ) చిరంజీవి యువత ఆధ్వర్యంలో కొత్తగా తిరువూరు నియోజకవర్గ, టౌన్ కమీటీ, మండల కమీటీలు ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికయిన చిరంజీవి యువత కమీటీ మాట్లాడుతూ మాకు సినిమాలు సరదాగా భావిస్తూ, రాజకీయాన్ని లక్ష్యంగా భావిస్తామని అన్నారు. సినిమా పరంగా అన్న చిరంజీవిని ఆరాధించినా, రాజకీయంగా మాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారే మా మనసుల్లో ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్న యువతని రాజకీయాల వైపు మళ్లించి, జనసేన సిద్ధాంతాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే నియోజకవర్గంలో ఉన్న మెగా అభిమానులను ఒక తాటివైపుకి తీసుకొచ్చి సినిమా వేడుకలను ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా కార్యక్రమాలు చేస్తూ, 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీని బలమైన శక్తిగా పెంపొందిస్తాం. అందుకు మా వంతు ప్రయత్నంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం అని అన్నారు.
కొత్తగా ఎన్నికయిన చిరంజీవి యువత కమీటీ :
తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత కమిటి :
- తిరువూరు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు : శ్రీ చింతలపాటి వె౦కటక్రిష్ణారావు గారు,
- తిరువూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు : శ్రీ షేక్ దస్తగిరి గారు,
- తిరువూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి : శ్రీ వుయ్యూరు జయప్రకాశ్ గారు,
- తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి : శ్రీ తోట సీతారామయ్య గారు,
- తిరువూరు నియోజకవర్గ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు : శ్రీ మేకల రామారావు గారు,
తిరువూరు టౌన్ కమిటి :
- రామ్ చరణ్ యువత అధ్యక్షులు : శ్రీ చిలకా వినోద్ కుమార్ గారు,
- టౌన్ చిరంజీవి యువత అధ్యక్షులు : శ్రీ షేక్ నాగుల్ మీరా గారు,
- టౌన్ చిరంజీవి యువత ఉపాధ్యక్షులు : శ్రీ పసుపులేటి దిలీప్ గారు,
- సాయి ధర్మ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు : శ్రీ షేక్ అన్వర్ గారు,
- వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షులు : శ్రీ మత్తె సతీష్ కుమార్ గారు,
- అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు : శ్రీ ఉప్పు విజయ రాంబాబు గారు,
మండల కమిటీలు :
- గంపలగూడెం మండల చిరంజీవి యువత అధ్యక్షులు : శ్రీ వట్టికుంట క్రిష్ణ గారు,
- ఎ.కోండూరు మండల చిరంజీవి యువత అధ్యక్షులు : శ్రీ లకావతు విజయ్ గారు,
- విస్సన్న పేట చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ బిల్లా నారాయణ రావు గారు,








