పార్టీ అభివృద్ధి కోసం విజయం కోసం పట్టుదలతో పని చేస్తాం : గూడూరు జనసైనికులు

పార్టీ అభివృద్ధి కోసం విజయం కోసం పట్టుదలతో పని చేస్తాం : గూడూరు జనసైనికులు

                      తిరుపతి పార్లమెంటరీ జనసేన కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ నూతన తిరుపతి పార్లమెంటరీ కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ గారిని సత్కరించిన గూడూరు జనసేన కార్యకర్తలు. తిరుపతి పార్లమెంటరీ జనసేన నూతన కమిటీ సభ్యులుగా ఎంపికైన తీగల చంద్ర శేఖర్ గారికి గూడూరు జనసేన నాయకులు అభినందన సభ ఏర్పాటు చేసి పూల మాలలు, శాలువలతో సత్కరించిన అనంతరం మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీగల చంద్ర శేఖర్ గారిని తిరుపతి పార్లమెంటరీ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, చంద్రశేఖర్ గారి సూచనలతో పార్టీ అభ్యున్నతి కోసం విజయాల కోసం కలిసి పని చేస్తామని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటరీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరచి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు, గూడూరు రూరల్, కోట, చిల్లకూరు, వాకాడు మండలాల నాయకులు జనసైనికులు నయీమ్ సూర్య షఫీ ధనంజయ్, కోటి, శంకర్, అల్లం బాబు, రమణ, జమాల్, వెంకటేష్, మణి, సాయి, గని, హరి రెడ్డి, మోహన్, పాల్గొన్నారు. 

See also  వైసీపీ కుట్రపూరితంగా జనసేన జండా దిమ్మె ధ్వంసం చేసిన ఘటనలో కోర్టుకి హాజరయిన జనసేన నాయకులు