చేనేత సమస్యల సాధన కోసం కృషిచేస్తాం :- జనసేనపార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్

చేనేత

     విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఎండాడ పార్టీ కార్యలయంలో శనివారం రోజు నిర్వహించిన రాష్ట్ర నాయకుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి చేనేత రాష్ట్ర కార్యదర్శి రవిప్రకాష్ హాజరై, చేనేత సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మిగనూరు జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇంఛార్జ్ గానిగ బాషా తెలిపారు. చేనేత  రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి పి ఏ సి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ గారు మరియు రాష్ట్ర చేనేత వికాస్ విభాగం ఛైర్మెన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు హాజరై రాష్ట్రంలో నేతన్నలు పడుతున్న అవస్థల గురించి చర్చించినట్లు తెలిపారు. చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కనీసం ప్రభుత్వ హామిలో భాగంగా చేనేతల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నేతన్న నేస్తంలో అర్హులకు న్యాయం జరగడం లేదని అన్నారు. చేనేత కార్మికులకు అండగా నిలబడి జనసేనపార్టీ చేనేత వికాస్ విభాగం నుంచి వారి సమస్యల సాధనకై కృషిచేస్తానని తెలిపారు.

See also  చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి