సాలూరు పట్టణ వ్యాపారస్తులకు అండగా నిలిస్తాం : జనసేన

సాలూరు వ్యాపారస్తులకు అండగా నిలిస్తాం : జనసేన

      కరోనా కారణంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, సాలూరు పట్టణంలో గడచిన 4 నెలలుగా లక్డౌన్ ల కారణంగా ఇబ్బందులు పడుతున్న అన్ని రకాల వ్యాపారస్తులు పడుతున్న కష్టాలు వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్థానిక ప్రజాప్రతినిధి శ్రీ రాజన్నదొర గారికి జనసేన తరుపున వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తరపున వారు సానుకూలంగా స్పందించి అధికారులతో సంప్రదించి వ్యాపారస్తులు సమస్య తీరుస్తాము అని హామీ ఇచ్చారు. ఊరిలో విపరీతంగా కేసులు పేరుగుతున్న దృష్ట్యా ఒకవేళ లాక్డౌన్ మరికొన్ని రోజులు పెరిగే అవకాశం ఉంటే ఇప్పటికే కుదేలు అయిన వ్యాపారస్తులకు ప్రభుత్వం ద్వారా బ్యాంకుల నుండి వడ్డీలేని అప్పులు ఇచ్చే ప్రయత్నాలు చేసి ఇప్పటికే అన్ని రకాలుగా కష్టాల్లో ఉన్న వ్యాపారస్తులకు చేయూతనివ్వాలి అని డిమాండ్ చేశారు. నెలల తరబడి షాపులు మూసుకుంటు ఉంటే వారి బ్రతుకు ఏలా అని ప్రభుత్వ సంస్థలకు మద్యం దుకాణాలకు ఇచ్చినట్లుగానే వ్యాపారస్తులకు కూడా మినహాయింపులు ఇచ్చి వారిని కూడా ఆదుకోవాలి అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ నాయకులు రేగు మహేశ్వర రావు ,శివకృష్ణ ,పరశురాం తదితరులు పాల్గొన్నారు. 

See also  ఆదరణ పనిముట్ల గోల్ మాల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు