జనసేనాని పేరుతో సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేస్తాం : కర్నాటక జనసైనికులు

జనసేనాని పేరుతో సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేస్తాం : కర్నాటక జనసైనికులు

                యుక్త వయసులో ఉన్న ప్రతి ఒక్క యువతి, యువకులకు సమాజంలో జరిగే విషయాలు తనను ప్రభావితం చేస్తాయో లేదో తెలీదు కానీ , సినిమాల మీద ప్రభావం మాత్రం చాలానే ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా గుండెలో పెట్టుకొని చూసుకునే హీరోగా పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క సినిమాలో యువతకు ఏదో ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఇది మేము పవన్ కళ్యాణ్ గారిని అభిమానిగా మారడానికి మార్గదర్శం అయింది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇప్పుడు దేవుడయ్యారు. ఎందుకంటే రెండో పవన్ కళ్యాణ్ గారిని మేము చూసాము కాబట్టి. నేడు ఒక మనిషి మీద ఉన్న ప్రేమతో యువత తప్పుదారిలో నడవకుండా సేవ మార్గం వైపు అడుగులేస్తున్నాం అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సినిమాలలోనే కాకుండా నిజ జీవితంలోను హీరోగా చూసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే.  మాకు ఇలా ఆయన మీద పెంచుకున్న అభిమానమే నేడు మా కర్ణాటక రాష్ట్రములో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవాసంఘం ప్రారంభించడానికి కారణం అయింది. ఈరోజు మేము ఆయనను సినిమా హీరోగా కాకుండా తన జీవితాన్ని జనం కోసం త్యాగం చేసిన జనసేనాని జనసైనికులుగా మారినాము. పవన్ కళ్యాణ్ గారికి రెండు ఆంధ్ర రాష్ట్రంలలోనే కాదు దేశం మొత్తం ఆయనకు అభిమానులున్నారు. ఎందుకంటే ఆయనకు దేశం మీద ఉన్న ప్రేమ, ఆయన చేసిన సేవలే మాకు స్పూర్తి. అదే స్ఫూర్తితో నేడు మా కర్ణాట రాష్ట్రంలో మావంతు సహాయంగా నిరుపేదలకు సహాయ సహకారాలు చేస్తున్నాం.
                ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి కేక్ కట్టింగులు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన పేరు మీద అనాధ శరణాలయాల్లో, వృధాశ్రమాలలో ఆహార పంపిణీ, రక్తదాన శిబిరలు ఏర్పాటు చేసి రక్తదానము చేయడం చేసి జనసైనికులుగా మారాం. ఏ ఆసరా లేని పిల్లకు, వితంతువులకు మా వంతు సహాయాన్ని చేస్తున్నాము. మేము గాంధీ గారిని చూడలేదు, భగత్ సింగ్ గారిని చూడలేదు, అల్లూరి సీతారామరాజు గారిని చూడలేదు… కానీ మేము చూసిన, చూస్తున్నా నాయకుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన సేవలే మాకు స్పూర్తి. 

See also  సేవాగుణం ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు రాహుల్ సాగర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి