అమరవీరుల ఆశయాల సాధన కోసం పోరాడుతాం : జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ ఆకుల సుమన్

అమరవీరుల

    హన్మకొండ, (జనస్వరం) : తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల కోసం ఇంకా పోరాటాలు జరగడం శోచనీయం అని జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ ఇంఛార్జ్ ఆకుల సుమన్ ఆవేదం వ్యక్తం చేసారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి గారు అని సుమన్ పేర్కొన్నారు. హన్మకొండ జిల్లా కార్యాలయంలో అమరవీరుడు శ్రీకాంతాచారి 12 వ వర్ధంతి సందర్భంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పించారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ వైఖరికి నిరసనగా ఆత్మబలిదానం చేసుకొని శ్రీకాంతాచారి ఉద్యమానికి ఊపిరి పోశారని ఆకుల సుమన్ అన్నారు. ఉద్యమకారులు ఆత్మబలిదానాలు చేసుకుంది భౌగోళిక తెలంగాణ కోసం కాదని, బతుకు దెరువు , ఆత్మగౌరవ తెలంగాణ కోసం అని పేర్కొన్నారు. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య అలానే ఉందని, నీళ్ల కోసం తెలంగాణ ప్రజలు ఆరాటపడుతున్నారని అన్నారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం తమ పోరాటాలను కొనసాగిస్తామని సుమన్ స్పష్టంచేశారు. శ్రీకాంత్ చారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని శ్రీకాంత్ చారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.

See also  దువ్వ గ్రామంలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జనసైనికులు