హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : రేగిడి లక్ష్మణరావు

హరిరామ జోగయ్య

       న్యూస్ ( జనస్వరం ) : హరిరామ జోగయ్య గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి రేగిడి లక్ష్మణరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 80 ఏళ్ల వయసులో జోగయ్య గారి చేస్తున్న పోరాటం చూసి 50 ఏళ్ల వయసున్న యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాంట్లు తడుపుకుంటున్నారు.  ఈ బీసీ రిజర్వేషన్లు లో ఐదు శాతం కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలని గత ప్రభుత్వంలోనే తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు. కాపు సామాజిక వర్గంపై జగన్మోహన్ రెడ్డి గారు పదేపదే విషం చిమ్ముతున్నారన్నారు. వైయస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు, ఎమ్మెల్సీలు జోగయ్య గారి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే మీరు కాపు ద్రోహులే అని విమర్శించారు. 

See also  2021 MPTC And ZPTC Janasena Candidates Win List