కాపులకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించిన విజయనగరం జనసేన నాయకులు

విజయనగరం

          విజయనగరం ( జనస్వరం ) : రాజమండ్రిలో వైసీపీ నిర్వహించిన కాపు సభలో, కాపులకు జరిగిన అన్యాయం గురించి ఏమాత్రం ప్రస్తావించకుండా అంతా బాగుంది అన్న రీతిలో వ్యవహరించిన వైసీపీ కాపు మంత్రుల తీరును నిరసిస్తూ  జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు విజయనగరం జనసేన పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ అనుసరిస్తున్న కాపు వ్యతిరేక విధానాల గురించి, కాపులకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో కాపు నాయకులు మోపాడ అనిల్, మజ్జి శివశంకర్, శ్రీమతి మాత గాయత్రీ, శ్రీమతి కృష్ణవేణి, ముత్యాల నాయుడు, ఎర్నాగుల చక్రవర్తి, లోకల్ బాయ్ ప్రసాద్ ఇంకా చాలామంది కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  మరొక్క సారి జలమయమైన డాంగే నగర్, కాకాని నగర్, ఆర్ టి సి కాలనీలు పట్టించుకోని అధికారులు : జనసేన పార్టీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి