జనసేనపార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా నాయకులు ఆత్మీయ సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : విజయనగరం( S.V.N హోటల్)లో జనసేన పార్టీ( P.A.C.S) సభ్యులు కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని ఉన్న నియోజకవర్గాల క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శృంగవరపుకోట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు పెదిరెడ్ల రాజశేఖర్ ప్రసంగిస్తూ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల చేస్తూ, కష్ట, నష్టాల్లో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు 1,000 మందిని పార్టీలో జాయిన్ చేశానని, మొత్తం నియోజకవర్గ స్థాయిలో 5000 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి ఆకర్షితులై రానున్న ఎన్నికల్లో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారని కచ్చితంగా శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసి కృషి చేసి కచ్చితంగా విజయకేతనం ఎగుర వేస్తామని తెలియజేశారు.

See also  జగన్నన్న ఇల్లు అతి పెద్ద స్కాం : ఆమదాలవలస జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు