KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా వినుత కోటా పర్యటన

వినుత కోటా

     శ్రీకాళహస్తి  ( జనస్వరం ) : KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారు ఈరోజు ఏర్పేడు మండలం, రాజుల పాళెము పంచాయతీ లో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుండి కట్టిస్తామన్న ఇళ్లు 2 సం. అయినా కాంట్రాక్టర్లకు అప్పగించి మొండి గోడలు స్థాయిలో అసంపూర్తి గా ఉంది , సచివాలయం బిల్డింగ్ అసంపూర్తిగా ఉంది, రైతు బరోసా కేంద్రం అసంపూర్తిగా ఉంది, డ్రైనేజీ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేలా జనసేన పార్టీ తరఫున ప్రయత్నిస్తామని గ్రామస్థులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు నితీష్ కుమార్, గురు ప్రసాద్, పవన్, బాలాజీ, వెంకటరమణ, చంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

See also  అతికారి దినేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు