రోడ్డు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని వినూత్న నిరసన చేపట్టిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు

రోడ్డు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని వినూత్న నిరసన చేపట్టిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు

       విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ ప్రజలు అలాగే, గాజువాక ప్రజలు విశాఖపట్నం సిటీకి చేరుకోవాలంటే అతి సులువైన మార్గము కాన్వెంట్ రోడ్డు మార్గము.  అయితే Essar కంపెనీ నుంచి కాన్వెంట్ కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద టిప్పర్లు కెమికల్స్, మినరల్స్ తీసుకువెళుతూ కవర్ కప్పకుండా రోడ్డు మీద జల్లుతూ వెళ్లడంతో ఇబ్బందిగా మారిందని పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు అన్నారు. ఈ చలికాలంలో మంచు వల్ల రోడ్లు జారిపోతున్నాయి. అటుగా టూ వీలర్ మీద ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోవడం మరియు కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని జివిఎంసి కమిషనర్ కి, జోనల్ కమిషనర్ కి నేరుగా వెళ్లి విన్నవించడం జరిగింది . పోర్ట్ నుంచి వచ్చే ఈ వాహనాలు నిబంధనలు పాటించక పోవడం వలన విశాఖలో దుమ్ము కాలుష్యం పెరగడానికి ఒక కారణం అని గమనించాలని అన్నారు. అదేవిధంగా అటువైపు ప్రయాణించే టూవీలర్ వాహనదారులకు అవగాహన కల్పించడానికి బ్యానర్లు పెట్టడం కూడా జరిగింది. రోడ్డుకి ఇరువైపులా బ్యానర్లు చేతిలో పట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం జనసేన యువ నాయకులు ధర్మేంద్ర ఇండస్ట్రియల్ బెల్టు నాయకుల శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. 

See also  రాష్ట్ర ప్రగతికి బడ్జెట్ లో ఏమాత్రం తావివ్వని వైకాపా ప్రభుత్వం