ఇంటి పన్ను పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ GVMC వద్ద నిరసన తెలియజేసిన విశాఖపట్నం జనసేనపార్టీ కార్పొరేటర్లు

ఇంటి పన్ను

     విశాఖ మహానగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఆస్థి పన్ను, ఇంటి పన్ను  పెంపుపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన జనసేన కార్పొరేట్లర్లు. అక్రమంగా పెంచిన ఇంటి పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ GVMC కౌన్సిల్ మీటింగ్ లో మేయర్ కు జనసేన గళాన్ని వినిపించిన  జనసేన కార్పొరేటర్లు శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి గారు, శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు, శ్రీ వెంకట నారాయణ మూర్తి యాదవ్ గారు  మేయర్ పోడియంను చుట్టుముట్టడంతో సీటులో నుంచి లేచి వెళ్లిపోయిన మేయర్ గారు. వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో  ప్రజలు ఇబ్బంది పడుతుంటే దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, ఇంటి పన్ను, చెత్తపన్ను వంటివి పెంచడం ద్వారా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటము చేస్తూ ఉంటామని జనసేన కార్పొరేట్లర్లు ఈ సందర్బంగా అన్నారు.

See also  కేతంరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన యువకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి