విప్లవతేజం నేతాజీ ~జనసేనపార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

నేతాజీ

    విజయనగరం, (జనస్వరం) : నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పాలవలస యశస్వి ఆధ్వర్యములో నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి జనసేన నాయకురాలు యశస్వి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మకరమైన ఇండియన్ సివిల్ సర్వీసును తృణప్రాయంగా వదిలి భరతమాత ద్రాస్యశృంఖాలను విడిపించుటకై స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న దేశభక్తుడు నేతాజీ అని, జయంతి కలిగి వర్ధంతి లేని మహనీయులు సుభాష్ చంద్రబోస్ అని ఆయన ధైర్యసాహసాలను అభివర్ణించారు. అటువంటి మహనీయులు నేతాజీ ప్రతీ భారతీయునికి ఆదర్శప్రాయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), మోపాడ అనిల్ కుమార్, బొబ్బాది చంద్ర నాయుడు, కిలారి ప్రసాద్, కులదీప్, రవికుమార్, సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

See also  పెత్తనం చేస్తూ మా పైనే కేసులా? : ఏపీ శివయ్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి