చీడికాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. జనసేన ప్రస్థానం గురించి పుస్తకం విడుదల

     వినాయక చవితి సందర్బంగా, నేడు చీడికాడలో గల మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలందరికి శుభం కలగాలని వినాయకుని పూజా  కార్యక్రమం నిర్వహించామని జనసేన నాయకులు తెలిపారు. ఆ సందర్భంగా బోయిదాపు కిరణ్ గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో కరోనా మహమ్మారీ లాంటి విఘ్నాలన్ని తొలగి నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ వినాయకుని వేడుకున్నాం అని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి మహమ్మారుల నుంచి ప్రజలందరినీ ఆ ఓంకార స్వరూపుడు కాపాడాలని, అందరికీ ఆరోగ్యంతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని.. సత్పరిపాలన అందించవలసిన ప్రభుత్వాధినేతలు కక్షపూరిత, వ్యర్థ పాలన వైపు పోకుండా సద్బుద్ధి ప్రసాదించాలని ఆ గణనాధుని మా మాడుగుల జనసేన పార్టీ తరపున ప్రార్ధిస్తున్నాము అని తెలిపారు. తదుపరి జనస్వరం న్యూస్ వారు అందించిన “2019 ఎన్నికల తరువాత జనంలోకి జనసేన ప్రస్థానం” పుస్తకావిష్కరణ జరిగింది. ఈ పుస్తకం ద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు మరియు 2019 ఎన్నికల ఘోర పరాభావం తరువాత ప్రధాన ప్రతిపక్ష పోషించే స్థాయిలో పార్టీ ఎదిగిన తీరుని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశామని.. ఈ పుస్తకాన్ని ప్రజలలోకి తీసుకోని వెళ్లాలని జనసైనికులను కోరారు. ఈ కార్యక్రమంలో బైలపూడి ఉప సర్పంచ్ శ్రీ గుమ్మడి సంతోష్ గారు, జివి.మూర్తి, గుమ్మడి శ్రీరామ్, నాయుడు, నవీన్, శ్రీనాదు విజయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  వైసీపీ అసమర్థ పాలనకు నిదర్శనం అమలాపురం ఘటన : కరప మండలం జనసేన నాయకులు