హిందూపురంలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కొరియన్ కనకరాజు విజయోత్సవ వేడుకలు

హిందూపురం, ఆగస్టు 7 (జనస్వరం): మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా హిందూపురంలోని విష్ణు థియేటర్‌లో మెగా యూత్ ఫోర్స్ రాయలసీమ కన్వీనర్ చక్రవర్తి చక్రి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా హీరోల విజయాలు అభిమానుల విజయాలేనని, మంచి కథాంశంతో రూపొందిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉందని చక్రవర్తి చక్రి తెలిపారు. భవిష్యత్తులో కూడా మెగా హీరోల సినిమాలకు ఇదే తరహా ఆదరణ లభించాలని ఆకాంక్షించారు. అనంతరం అభిమానులకు స్వీట్లు పంపిణీ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ జిల్లా కో-కన్వీనర్ వినయ్ రెడ్డి, సర్దార్ శివ, నాగరాజు, మూర్తి, నరేష్, విజయ్ (ఆర్‌సీ), దాదు, అంబేద్కర్ నగర్ శివ, వెంకటేశులు, ఆది (వెంకటాపురం), పృథ్వీ, హరి, మనోహర్, ఇందు, మాస్ జనసేన నాయకులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

See also  బాలలసేవలో ఆదర్శం డాక్టర్ దాసరి సుబ్రమణ్యం