జనసేన అధినేత పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన వీరఘట్టం జనసేన నాయకులు

       వీరఘట్టం, (జనస్వరం) :  శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజక వర్గం, వీరఘట్టం మండలం, నడుకురు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స. పుండరీకం మాట్లాడుతూ వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని అర్థం అందుకే వైస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది పవన్ కళ్యాణ్ చేసే వారాహి బస్ యాత్రతో సాధ్యం అవుతుంది అని పుండరీకం తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం చేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కొండగట్టులో వారాహి వాహనంకి పూజ జరిగిన సమావేశంలో ఇక్కడ ప్రత్యేక పూజా జరిపామని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయ వారాహి బస్ యాత్ర విజయవంతం కావాలని అభయ ఆంజనేయ స్వామి కోరుకున్నామని మత్స. పుండరీకం తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత గోవర్ధన్, కలిపిల్ల సింహ చలం, వాన కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

See also  వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన నాయకుల డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి