వీర మహిళలు జనసేన పార్టీని బలపరచాలి : పాలకొల్లు నియోజకవర్గం వీర మహిళా విభాగం

వీర మహిళలు

       పాలకొల్లు ( జనస్వరం ) :  పాలకొల్లు నియోజకవర్గం జనసేన వీర మహిళా విభాగం నియోజకవర్గ ముఖ్య సమావేశం వీరమహిళలు రియా, పద్మజ, ఝాన్సీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన జనసేన స్టేట్‌ సహాయ కార్యదర్శి కారేపల్లి శాంతి ప్రియా, వీర మహిళా విభాగం కో -ఆర్డినేటర్స్‌ కాట్నం విశాలి, మధులత మాట్లాడుతూ జనసేన పార్టీ వీరమహిళా విభాగం తల్లిలాంటిదని ఇల్లు మహిళా ఎలా నడిపిస్తుందో అలాగే పార్టీలోని సభ్యులను కుటుంబ సభ్యుల్లా భావించి జనసేన పార్టీ ని బలపరచాలని చెప్పారు. అలాగే అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల పక్షాన నిలబడి తప్పులను ప్రశ్నించాలని వారిని ఎదిరించి పోరాడాలని మహిళా విభాగం సభ్యులకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటా మని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఈదా ప్రమీల , షేక్‌ వలియా బేగం, కొప్పిశెట్టి జ్వాల, పోతల సంధ్యారాణి, పాటబళ్ల రూప, లంకలపల్లి గంగా భవాని, పాలూరి భగవద్గిత, నదేశినీడి విజయకుమారి, మెడిచర్ల జ్యోతి, గొల్లపల్లి విజయలక్ష్మి, వర్ధినీడి వెంకట లక్ష్మి, ఆకుల మౌనిక , జద్దు గంగాభవాని, కందుకూరి విజయకుమారి , సామినేని వెంకట సత్యవతి , కొకర పర్తి దివ్య పాల్గొన్నారు.

See also  జగన్ కేసులు మాఫీ చేసుకునేందుకు ఢిల్లీ పర్యటనలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు : డా. మైఫోర్స్ మహేష్