గుంతకల్ పట్టణ జనసైనికులతో వాసగిరి మణికంఠ ఆత్మీయ సమావేశం

      గుంతకల్ ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారిని గుంతకల్ పట్టణం ధోని ముక్కల రోడ్డు ఇందిరమ్మ బోర్డ్ కాలనీ చెందిన పలువురు యువకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ యువకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుంతకల్ నియోజకవర్గం లో నిరుద్యోగ సమస్య తీరడానికి ఉపాధి అవకాశాలు పెరిగేలా జనసేన పార్టీ కృషి చేయాలని. ముఖ్యంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, వారికి సంబంధించిన పిల్లలు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చెబుతున్నారని వారి ఆవేదనను తెలియజేశారు. అనంతరం వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ వైసీపీ సర్కార్ గడిచిన ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిందని. ఇలాంటి మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దదించేలా రాబోవు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జనసేన పార్టీ విజయానికి నిస్వార్ధంగా కృషి చేయాలని కోరారు. తద్వారా జనసేన పార్టీ యువకులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యంగా కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో వారు ఉపాధి కల్పించేలా మారేందుకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ యువకులకు తెలియజేశారు.

See also  మహిళలకు రక్షణ కల్పించాలని కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన గుంతకల్ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి