సచివాలయంలో జగనన్న ఇళ్ళు గురించి వివరాలు అడిగి తీసుకున్న వజ్రకరూరు జనసేన నాయకులు

వజ్రకరూరు

        ఉరవకొండ ( జనస్వరం ) : జగనన్న కాలనీలలో క్షేత్రస్థాయిలో జరిగిన పనితీరుకు, సచివాలయ సిబ్బంది చూపే లెక్కలకు ఏమాత్రం పొంతన ఏమాత్రం లేదని వజ్రకరూరు మండల అధ్యక్షుడు కేశవ్ అచ్చానాల పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ వజ్రకరూరు మండలం లోని కొన్ని పంచాయతీలోని సచివాలయాలకి వెళ్లి సదరు గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంపిక అనుసరించిన విధానాలు ఏమిటి, ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎంత మేరకు బిల్లులు మంజూరు చేశారు వంటి విషయాలను సచివాలయ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాని వారు చెప్పిన వాటికి అక్కడ ఉన్నవాటికి ఎటువంటి పొంతన లేదు అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు హరిశంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శులు అంజినేయులు, గణేష్, సంయుక్త కార్యదర్శి జగదీష్ ఈతర మండల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

See also  కలెక్టర్ లేఖతో జగ్గంపేట జనసేన ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర నిరాహారదీక్ష విరమణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి