2026 నూతన సంవత్సర జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ

పుట్టపర్తి, అక్టోబర్ 13, (జనస్వరం) : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం జనసేన పార్టీ నాయకులు మీనా గణేష్ నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివ ప్రసాద్, బుక్కపట్నం మండల అధ్యక్షులు జయరాం, బుక్కపట్నం టౌన్ కన్వీనర్ దాసరి శ్రీనివాసులు, జనసేన నాయకులు మీనా గణేష్, తోట వెంకటేష్, జనార్ధన్, కుజీర్, కిషోర్ కుమార్, ధర్మవరం జనసేన నాయకులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

See also  పుస్తక పఠనంతోనే మెరుగైన భవిత : ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు