
శేరిలింగంపల్లి, జూన్ 7 (జనస్వరం) : ‘ఫ్రెండ్ నాట్ ఎండ్’ లఘుచిత్ర పోస్టర్‌ను మియాపూర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆదివారం ఆవిష్కరించారు. అంజి హీరోగా, స్మార్ట్ సుప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అరుణ్ చిరుమణి కథ, దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. నితిన్, శంకర్, సాయి నరసింహ, నీలకంఠ, చిన్న నాని, నరసింహ, చింటూ తదితరులు పాల్గొన్నారు.








