తాగునీటి వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

వాటర్ ప్లాంట్

       అనంతపురం రూరల్ ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి సర్పంచ్ అంజి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగనీటి వాటర్ ప్లాంట్ ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి  మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్ అంజి యాదవ్ ను అభినందించారు. పంచాయతీ అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కాలనీలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్న ఉప సర్పంచ్ మన్నల వరలక్ష్మిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..

See also  ఇమామ్, మౌజన్ ల వేతనాలకు రూ.90 కోట్లు విడుదల చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి