డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ లో 110 వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సకు స్విచ్ ఆన్ కార్యక్రమం విజయవంతం.

డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సకు స్విచ్-ఆన్ కార్యక్రమం విజయవంతం.

పుట్టుకతో మూగ-చెవిటిగా ఉన్న చిన్నారికి వినికిడి ప్రపంచాన్ని పరిచయం చేసిన డాక్టర్ రాజేష్ వేపూరి

నరసరావుపేట, జూలై 28( జనస్వరం)

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో మరో అరుదైన వైద్య మైలురాయి నమోదైంది. ప్రముఖ ఈఎన్‌టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించిన 110వ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స అనంతరం, ఆ చిన్నారికి “స్విచ్-ఆన్” (Implant Activation) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం, పాతకోటి గ్రామానికి చెందిన  పాతకోటి శ్రీను వారి కుమారుడు పుట్టుకతోనే మూగ-చెవిటితనంతో బాధపడుతున్నాడు. చిన్నారి వినికిడి సమస్యను గుర్తించిన కుటుంబ సభ్యులు డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిన్నారికి పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వేపూరి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 110 శస్త్రచికిత్స లను సుమారు 99 శాతం విజయవంతమైన ఫలితాలతో, ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా పూర్తి చేశామని తెలిపారు.తాజాగా నిర్వహించిన 110వ శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనదని ఆయన వివరించారు. సాధారణంగా చెవి లోపల ఉండే కాక్లియా మూడు టర్న్స్‌లో ఒక టర్న్ పూర్తిగా మూసుకుపోయినప్పటికీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా ఇంప్లాంట్ అమర్చినట్లు తెలిపారు. ఇందుకోసం అమెరికా నుంచి తెప్పించిన ₹1.25 కోట్ల విలువైన హైఎండ్ సర్జికల్ మైక్రోస్కోప్, ₹10 లక్షల విలువైన అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ సిస్టమ్ ఉపయోగించినట్లు చెప్పారు.అనంతరం శస్త్రచికిత్స గాయం పూర్తిగా మానిన తర్వాత నిర్వహించిన స్విచ్-ఆన్ కార్యక్రమం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంప్లాంట్‌ను యాక్టివేట్ చేయగానే, ఇప్పటివరకు నిశ్శబ్ద ప్రపంచంలో ఉన్న చిన్నారి తొలిసారిగా శబ్దాలను గ్రహించి ఆశ్చర్యానికి గురై ఏడవడం ప్రారంభించింది. ఈ దృశ్యం కుటుంబ సభ్యులతో పాటు వైద్య బృందాన్ని కూడా కదిలించింది.ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వేపూరి మాట్లాడుతూ స్విచ్-ఆన్ అనేది చికిత్సలో అత్యంత కీలకమైన దశ అని తెలిపారు. పిల్లలు తొలిసారి శబ్దాలను విన్నప్పుడు భయపడటం లేదా ఏడవడం సహజమని, అది వారు వినికిడి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తొలి సంకేతమని చెప్పారు. అనంతరం క్రమం తప్పకుండా మ్యాపింగ్, స్పీచ్ థెరపీ, హియరింగ్ ట్రైనింగ్ చేయించడం ద్వారా పిల్లలు సాధారణంగా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని, ఇందులో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని సూచించారు.చిన్నారి తండ్రి పాతకోటి శ్రీను మాట్లాడుతూ తమ కుమారుడికి పుట్టుకతోనే వినికిడి సమస్య ఉందని, ఇతర ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు సుమారు ₹6 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని తెలిపారు. అయితే డాక్టర్ రాజేష్ వేపూరిని సంప్రదించగా, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, ఇప్పుడు స్విచ్-ఆన్ కార్యక్రమం ద్వారా తమ కుమారుడికి వినికిడి ప్రపంచాన్ని పరిచయం చేశారని ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ రాజేష్ వేపూరికి, డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ లక్షల రూపాయల ఖర్చుతో కూడిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎల్‌ఓసీ, ఈఎస్‌ఐ/ఈహెచ్‌ఎస్ మరియు వివిధ ఆరోగ్య బీమా పథకాల ద్వారా అర్హులైన రోగులకు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

See also  శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని బాపట్లలో జనసేన నాయకులు, వీర మహిళల పూజలు