కళ్యాణదుర్గంలో పవన్ కళ్యాణ్ సేవా అసోసియేషన్ పోస్టర్ విడుదల ఘనంగా

కళ్యాణదుర్గం, జనవరి 18, (జనస్వరం) : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సేవా అసోసియేషన్ పోస్టర్‌ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్ మరియు సేవా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సేవా అసోసియేషన్ ద్వారా పేదలు, అవసరమైనవారికి నిరంతరం సేవలు అందించే విధంగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. అనంతరం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బాల్యం రాజేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు వి.హెచ్.రాయుడు, సేవా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్, మండల జనసేన నాయకులు మణికంఠ, దండు తిప్పేస్వామి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

See also  అధికారిక వేదిక పైన ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని విమర్శించడం ఎంతవరకు సబబు?

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి