సత్తివాడ గ్రామంలో బెంచ్ లు ఏర్పాటు మరియు గ్రామాన్ని శానిటైజేషన్ చేసిన జనసైనికులు

సతిపాడ

         విజయనగరం ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం సత్తివాడ గ్రామంలో జనసైనికులు ఈ రోజు గ్రామ బస్ స్టాప్ లో సిట్టింగ్ బెంచెస్ ఏర్పాటు చేసారు. పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీజనల్ జ్వరాలు నివారించేందుకు ముందస్తు చర్యగా డ్రైనేజీలో బ్లీచింగ్ వేసి గ్రామాన్ని శానిటైజేషన్ చేశారు. గ్రామంలో ఆరోగ్య జాగ్రత్తల చర్యల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ జనసైనికులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు సత్యన్నారాయణ, గోపాల్, వాసు, సుమన్, అజయ్, లోకేష్, పరశరామ్, రాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

See also  వైసీపీకి తమ ఓటుతో ఘోరీ కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు