
కొత్తచెరువు, జనవరి 12, (జనస్వరం) : పుట్టపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు జనసేన కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ అధ్యక్షతన స్థానిక కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనస్వరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పూల శివప్రసాద్ మాట్లాడుతూ, ఇప్పటివరకు జనసేన పార్టీ చేపట్టిన ప్రజా కార్యక్రమాలను సమగ్రంగా ప్రతిబింబించేలా జనస్వరం క్యాలెండర్ రూపుదిద్దుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ క్యాలెండర్ ద్వారా జనసేన పార్టీ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా చేరుతాయని తెలిపారు. అలాగే తన తరఫున పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, జనసైనికులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PACS డైరెక్టర్ నారాయణ స్వామి, మండల ప్రధాన కార్యదర్శి హనుమంతు నాయక్, రెడ్డప్ప, గూడ మధు, సోమశేఖర్, పూల వెంకటేష్, నాగమణి, ముత్త నరేంద్ర, చింతల ప్రసాద్, సమ్మెట నవీన్, సాయి, కరుణాకర్, నాగార్జున, విశ్వనాథ్, వెంకటేష్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.








