జనసేన ఆధ్వర్యంలో దివ్యాంగులు మహాసేన మరియు సహచర దివ్యాంగుల సంఘాలు నిరసన

జనసేన ఆధ్వర్యంలో దివ్యాంగులు మహాసేన మరియు సహచర దివ్యాంగుల సంఘాలు నిరసన

దివ్యాంగులు మహాసేన మరియు సహచర దివ్యాంగుల సంఘాలు ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం, జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం నందు దివ్యాంగులుకు కేటాయించిన 4% ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని, అలాగే రాజకీయ 5% రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు కన్నా ఆత్మగౌరవంతో కూడిన జీవన ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దివ్యాంగులకు న్యాయం చేకూరాలని బిజెపి మరియు జనసేన పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ ఇంచార్జి సందీప్ పంచకర్ల గారు, జనసేన పార్టీ నాయకులు శివ ప్రసాద్ గారు, సతీశ్ గారు, బిజెపి నాయకులు ఫణీంద్ర భూపతి గారు, విశాఖ జిల్లా జనసేన నాయకులు బి.వి.కృష్ణయ్య గారు, భీమిలి నాయకులు సంతోష్ బరాటం, ప్రసాద కుభిరెడ్డి, సాయి కృష్ణ, సాయికిరణ్, రామన్ సుబ్బారావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

See also  రాష్ట్ర గిరిజన నాయకుడు తుమ్మి అప్పలరాజు దొర జనసేన పార్టీలోకి చేరిక