అర్ధరాత్రిలో స్థానికులను హడలెత్తిస్తున్న అధికార యంత్రాంగం.

అర్ధరాత్రిలో స్థానికులను హడలెత్తిస్తున్న అధికార యంత్రాంగం. 
సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు వెంకన్నపాలెం గ్రామంలో అర్ధరాత్రి పూట స్థానికులను హడలెత్తిస్తున్న అధికార యంత్రాంగం.  వివరాల్లోకి వెళ్తే నవరత్నలకై  యస్.సి, యస్.టి ల స్థలాలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భూ సేకరణ వివాదంలో ఎమ్మార్వో గారు, అధికార యంత్రాంగం వచ్చి అక్కడి స్థానికులు రాత్రివేళ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనుక్రాంత్ గారి తరపున జిల్లా నాయకులు కిషోర్ గునుకుల అక్కడికి వెళ్లి వాళ్లకి ధైర్యం చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని, న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఈ విషయమై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వెంకటయ్య గారి ఆరోగ్య పరిస్థితి కనుక్కొని జనసేన పార్టీ తోడుగా ఉందని,  తొందరపడవద్దని హమీ ఇచ్చారు. అనంతరం ఎమ్మార్వో గారిని కలసిన కిషోర్ గునుకుల గారు పేదలపై దురుసుగా వ్యవహరించవద్దని, గత అధికారుల దౌర్జన్యంతో మనస్థాపానికి గురై అత్మహత్యా ప్రయత్నం చేసిన బాధితుడు ఇంకా కోలుకోలేదనీ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పంచాయితీకి సంబంధించిన గ్రామదత్తం భూములను రెవెన్యూ అధికారుల పెత్తనం సబబు కాదని, ఏవైనా సమస్యలు ఉంటే ఆఫీసు సమయంలో రావాలనీ, ఫలానా స్థలానికి రావాలని ఇబ్బందులు పెట్టే మీకు అర్ధరాత్రులు గ్రామంలో ఏమి డ్యూటీ చేస్తున్నారనీ, పేదల పట్ల న్యాయంగా వ్యవహరించాలని తెలియజేసారు.

See also  అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం కాదు... రైతులకు ఎలా న్యాయం చేయాలో చూడండి - శ్రీ పవన్ కల్యాణ్ గారు...